Pawan Kalyan : ఓడినవారు అలాగే అంటారు మరి
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కాకినాడలో ఆయన జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రసంగించారు. భారత్ పై అంతర్జాతీయ కుట్ర జరుగుతుందని పవన్ కల్యాణ్ అన్నారు. విదేశీ శక్తుల కనుసన్నల్లో అంతర్గత శక్తులు పనిచేస్తున్నారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
లోపం ఉందంటూ...
జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ ఓడిపోయారని, అందుకే ఎన్నికల ప్రక్రియలో లోపం ఉందని మాట్లాడుతున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. ఇటు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ను రాష్ట్ర స్థాయిలో వైసీపీని విమర్శించేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నించారు. గత ప్రభుత్వంలో చీకటి రోజులున్నాయని, వాటిని పారదోలేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తుందని పవన్ కల్యాణ్ తెలిపారు.