Pawan Kalyan : నేడు విజయనగరం జిల్లాకు పవన్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు
Pawan Kalyan
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. గుర్ల గ్రామంలో అతి సార బాధితులను ఆయన పరామర్శించనున్నారు. గుర్ల గ్రామంలో అతి సార వ్యాధితో ఇప్పటికే ఎనిమిది మంది మరణించిన సంగతి తెలిసిందే. మరికొందరు డయేరియా బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో విజయనగరం జిల్లాలోని గుర్ల గ్రామంలో పవన్ కల్యాణ్ ఈరోజు పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు.
గుర్ల గ్రామంలో...
అనంతరం అధికారులతో సమీక్షించనున్నారు. డయారియా వ్యాధి ప్రబలడానికి గల కారణాలను ఆయన తెలుసుకోనున్నారు. దీంతో పాటు ఆ ప్రాంతంలో డయేరియా వ్యాధి ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలపై పవన్ కల్యాణ్ నేడు అధికారులతో సమీక్షించనున్నారు. వారితో మాట్లాడి వారికి ఏం చేయాలో దిశానిర్దేశం చేయనున్నారు. గ్రామ ప్రజలకు సురక్షితమైన మంచి నీరు అందుతుందా? లేదా? కూడా తెలుసుకుని అందుకు అనుగుణంగా అవసరమైన చర్యలు పవన్ కల్యాణ్ తీసుకోనున్నారు.