Pawan Kalyan : రేపు ప్రకాశం జిల్లాకు పవన్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ నెల 4వ తేదీన ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు.

Update: 2025-07-03 02:48 GMT

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ నెల 4వ తేదీన ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని మార్కాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అక్కడ నరసింహాపురం తాగునీటి పథకానికి పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. 1,290 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఈ పథకానికి పవన్ కల్యాణ్ అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.

మార్కాపురం నియోజకవర్గంలో...
ఈ ప్రాంతంలో అతి పెద్ద తాగునీటి పథకానికి పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేయడానికి వస్తుండటంతో పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 9.45 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి అక్కడ కార్యక్రమాలను ముగించుకుని తిరిగి మధ్యాహ్నం 2.40 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. పవన్ పర్యటనకు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.


Tags:    

Similar News