Pawan Kalyan : రెండు రోజులు పిఠాపురానికి పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ నెలలో రెండు రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు
Pawan Kalyan
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ నెలలో రెండు రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో సమావేశం కానున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. పిఠాపురం అభివృద్ధికి సంబంధించి పవన్ కల్యాణ్ అధికారులతో సమీక్ష జరిపి చర్చించనున్నారు.
అభివృద్ధి పనులను...
ఈ నెల 4, 5న పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన ఖరారయింది. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పవన్ కల్యాణ్ పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష చేయనున్నారు. అలాగే పార్టీ నేతలతో సమావేశం కానున్న పవన్ కల్యాణ్ వారికి దిశానిర్దేశం చేయనున్నారు.