Pawan Kalyan : నేడు గ్రామసభలో పాల్గొననున్న పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు
pawan kalyan
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. మైసూరువారి పల్లిలో జరిగే గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. ఉదయం రేణిగుంట విమానాశ్రయంలో దిగనున్న పవన్ కల్యాణ్ అక్కడి నుంచి నేరుగా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని మైసూరావారి పల్లికి చేరుకుంటారు.
గ్రామసభలో....
గ్రామసభలో అక్కడ ప్రజలతో నేరుగా మాట్లాడతారు. గ్రామంలో నెలకొన్న సమస్యలపై పవన్ కల్యాణ్ చర్చించనున్నారు. అనంతరం రాజంపేట నియోజకర్గానికి చేరుకుంటారు. అన్నమయ్య ప్రాజెక్టు పరిశీలన ఉంటుంది. తర్వాత పులపుత్తూరు గ్రామాన్ని పవన్ కల్యాణ్ సందర్శిస్తారు. అనంతరం తిరిగి రేణిగుంట విమానాశ్రయం నుంచి విజయవాడకు బయలుదేరతారు.