Pawan Kalyan : నేడు కడప జిల్లాకు పవన్... పరామర్శకు
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు కడప జిల్లాకు బయలుదేరి వెళ్లనున్నారు
pawan kalyan delhi tour today
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు కడప జిల్లాకు బయలుదేరి వెళ్లనున్నారు. అన్నమయ్యజిల్లాలో ఎంపీడీవోపై వైసీపీ నేతలు దాడి చేసిన ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న జవహర్ బాబును పవన్ కల్యాణ్ పరామర్శించనున్నారు. ఈ ఘటనను తీవ్రమైన విషయంగా భావించిన పవన్ కల్యాణ్ అధికారులకు అండగా నిలబడేందుకు అక్కడకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
కడప రిమ్స్ లో...
వైసీపీ నేతలో గాయపడి కడప రిమ్స్ లో జహర్ బాబు చికిత్స పొందుతున్నారు. గాలివీడు మండలం ఎంపీడీవో జవహర్ బాబుపై వైసీపీ నేత సుదర్శన్ రెడ్డితో పాటు అతని అనుచరులు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బాధితుడికి అండగా నిలవాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు. నేరుగా కడప రిమ్స్ కు వెళ్లి జవహర్ బాబును పరామర్శించనున్నారు. ఇప్పటికే దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పవన్ కల్యాణ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. నేరుగా కడపకు వెళ్లి ఆయనను పరామర్శించి ఉద్యోగుల్లో భరోసా నింపాలని ప్రయత్నిస్తున్నారు.