నేడు తిరుపతిలో పవన్ వారాహి సభ
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కల్యాణ్ నేడు తిరుపతిలో వారాహి సభను నిర్వహించనున్నారు.
pawan kalyan
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కల్యాణ్ మూడు రోజుల నుంచి తిరుపతిలోనే ఉన్నారు. ఆయన ప్రాయశ్చిత్త దీక్షను విరమించడానికి కాలినడకన తిరుమలకు చేరుకుని స్వామి వారిని దర్శించుకున్న అనంతరం దీక్షను విరమించారు. అనంతరం తిరుపతికి ఆయన చేరుకున్నారు. పవన్ కల్యాణ్ నేడు తిరుపతిలో సభను నిర్వహించనున్నారు.
సాయంత్రం 4 గంటలకు...
తిరుపతిలో నేడు జ్యోతి రావ్ పూలే సర్కిల్‌లో సాయంత్రం 4 గంటలకు వారాహి బహిరంగ సభ ప్రారంభంకానుంది. వారాహి డిక్లరేషన్ ను ప్రజలకు పవన్ కల్యాణ్ వివరించనున్నారు. సనాతన ధర్మం పరిరక్షణ కోసమే తాను దీక్షను చేపట్టానని, గత ప్రభుత్వ హయాంలో అనేక దేవాలయాలు కూలగొట్టారని ఇప్పటికే చెప్పిన పవన్ కల్యాణ్ నేడు ఎలాంటి ప్రకటన చేయనున్నారోనన్న ఆసక్తి నెలకొంది.