Pawan Kalyan : పవన్ కల్యాణ్ కు అపోలోలో వైద్య పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. మరికొన్ని వైద్య పరీక్షలు అవసరమని తెలిపారు. ఆయనకు వైద్యులు కొన్ని సూచనలు చేసినట్లు తెలిసింది. ఈ నెలాఖరులో గాని లేదా మార్చి మొదటి వారంలో మిగిలిన వైద్య పరీక్షలు నిర్వహించాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు.
కొంతకాలంగా...
గత కొంత కాలంగా తరచూ అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లి బాడీ చెకప్ చేయించారు. అయితే మిగిలిన పరీక్షలు చేయించుకునేందుకు రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో వాటిని వాయిదా వేసుకున్నారు. ఆయన జ్వరం, స్పాండిలైటిస్ వంటి వాటితో ఇబ్బందులు పడుతూ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే.