Pawan Kalyan : నేడు తిరుపతికి పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు తిరుపతిలో పర్యటించనున్నారు

Update: 2025-11-08 03:33 GMT

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. తిరుపతిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రధానంగా పవన్ కల్యాణ్ తిరుపతి జిల్లాలో ఉన్న ఎర్రచందనం డిపోను పరిశీలించనున్నారు. ఎర్ర చందనం అక్రమ రవాణాతో పాటు స్మగ్లింగ్ నిరోధంపై అధికారులతో పవన్ కల్యాణ్ చర్చించనున్నారు.

ఎర్ర చందనం స్మగ్లింగ్ పై...
తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అటవీ శాఖ అధికారులతో పవన్ కల్యాణ్ చర్చిస్తారు. ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులతో పాటు అటవీ శాఖ సిబ్బంది సమస్యలను కూడా పవన్ కల్యాణ్ అడిగి తెలుసుకుంటారు. శేషాచలం అడవుల్లో అతి విలువైన ఎర్రచందనం స్మగ్లింగ్ కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.


Tags:    

Similar News