Pawan Kalyan : కొచ్చిలో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొచ్చిలో పర్యటిస్తున్నారు.

Update: 2025-02-12 07:26 GMT

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొచ్చిలో పర్యటిస్తున్నారు. కేరళలోని కొచ్చిసమీపంలో ఉన్న అగస్త్య మహర్షి ఆలయానికి పవన్ కల్యాణ్ వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కల్యాణ్ వెంట తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు ఆనంద్ సాయితో పాటు పవన్ కల్యాణ్ కుమారుడు అకీరానందన్ కూడా ఉన్నారు.

కుమారుడు అకీరానందన్ తో కలసి...
పవన్ కల్యాణ్ కేరళ, తమిళనాడులోని పుణ్యక్షేత్రాల్లో పర్యటనకు ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి కేరళలోని కొచ్చికి చేరుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు, పూజారులు స్వాగతం పలికారు. తమిళనాడు, కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో పవన్ కల్యాణ్ మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం పవన్ ఈ యాత్ర చేపట్టినట్లు చెబుతున్నారు.


Tags:    

Similar News