Pawan Kalyan : వైఎస్ షర్మిలకు భరోసా ఇచ్చిన పవన్ కల్యాణ్
కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు.
pawan kalyan delhi tour today
కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. షర్మిలకు అదనంగా సెక్యూరిటీ కల్పిస్తామని తెలిపారు. ఏలూరు జిల్లా జగన్నాధపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. మీ సోదరుడు మీకు భద్రత కల్పించలేకపోయాడేమో కాని, మీ ప్రాణాలకు కూటమి ప్రభుత్వం రక్షణగా ఉంటుందని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు.
భద్రత కల్పిస్తామంటూ..
ఒక బాధ్యత కలిగిన నాయకురాలిగా ఎక్కడైనా, ఎప్పుడైనా ఎన్ని విమర్శలైనా చేసుకునే హక్కు ఉందన్న పవన్ కల్యాణ్ మీరు అడిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి మీకు తగిన రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఆడబిడ్డల భద్రత విషయంలో ఈ ప్రభుత్వం వెనక్కు తగ్గదని తెలిపారు. తమది మంచి ప్రభుత్వమే కాని, మెతక ప్రభుత్వం కాదని తెలిపారు. సోషల్ మీడియాలో వైసీపీ నేతలు ఎలా అంటే అలా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులతో ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ మంచి పనులు చేయడానికి సిద్ధంగా ఉందన్న పవన్ కల్యాణ్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ప్రకటించారు.