ఏపీలో కరోనా తగ్గుముఖం.. ఈరోజు ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు బాగా తగ్గాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 675 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు బాగా తగ్గాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 675 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ముగ్గురు మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 23,14,502 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,705 మంది మరణించారు.
యాక్టివ్ కేసులు...
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 22,88,989 గా ఉంది. యాక్టివ్ కేసులు బాగా తగ్గుతున్నాయి. 10,808 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,28,93,908 నమూనాలను పరీక్షించారు. ఈరోజు అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ 143 కేసులు నమోదయ్యాయి.