Andhra Pradesh : సూపర్ సిక్స్ - సూపర్ ఫ్లాప్ : వైఎస్ షర్మిల

సూపర్ సిక్స్ - సూపర్ ఫ్లాప్ అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు

Update: 2025-09-10 06:04 GMT

సూపర్ సిక్స్ - సూపర్ ఫ్లాప్ అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని కూటమి ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటన్న షర్మిల హామీలు అమలు చేశామని అప్పుడే సక్సెస్ సభలు జరపడం హాస్యాస్పదమన్నారు. సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కటైనా పూర్తిగా అమలు చేశారా ? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగ బిడ్డలు ఉంటే ఒక్కరికైనా 3 వేల నిరుద్యోగ భృతి ఇచ్చారా ? అని వైఎస్ షర్మిల సూటిగా ప్రశ్నించార.

ఈ హామీల అమలు...
ఎన్నికలకు ముందు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న చంద్రబాబు హామీ ఎక్కడ అమలయిందని ఆయన ప్రశ్నించారు. స్థాపించని పరిశ్రమలతో అగ్రిమెంట్లు చేసుకున్నంత మాత్రానా ఉద్యోగాలు ఇచ్చినట్లా ? అని నిలదీశారు. ఒక్కరికీ నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, ఒక్క ఉద్యోగం రాకుండా సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎలా అయ్యిందని ఎద్దేవా చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 15 వందలు ఆర్థిక సహాయం అనేది సూపర్ సిక్స్ హామీఅని కూటమి ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల్లో ఒక్క మహిళకైనా 15 వందలు ఇచ్చారా అని షర్మిల నిలదీశారు. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.



Tags:    

Similar News