Andhra Pradesh : వైఎస్ షర్మిలతో బొత్స మాటా మంతీ

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిశ్రమపై జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణతో వేదికను పంచుకున్నారు.

Update: 2025-09-13 02:01 GMT

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిశ్రమపై జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణతో వేదికను పంచుకున్నారు. విజయవాడలో జరిగిన ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు హాజరయ్యేందుకు వచ్చిన వైఎస్ షర్మిలను మాజీ మంత్రి బొత్స సత్యనారాయన తన పక్కనే ఉన్న కుర్చీని చూపించి ఆహ్వానించారు.

రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు వచ్చిన...
షర్మిల వచ్చిన వెంటనే గౌరవంగా లేచి నిలబడి ఇక్కడ కోర్చావాలంటూ తన పక్కనే ఉన్న కుర్చీని బొత్స సత్యనారాయణ చూపించారు. అందులో ఆశీనులైన వైఎస్ షర్మిల కాసేపు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణతో మాట్లాడారు. పక్కనే ఉన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను కూడా షర్మిల పలకరించారు. సమావేశంలో ప్రసంగించిన అనంతరం వారిద్దరికీ మర్యాదపూర్వకంగా వెళ్లొస్తానంటూ చెప్పి వెళ్లిపోయారు. ఇది ఆసక్తిగా రెండు పార్టీల నేతలు చూడటం కనిపించింది.


Tags:    

Similar News