కడపలో నేడు జగన్ పర్యటన ఇలా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటన కొనసాగుతుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటన కొనసాగుతుంది. నిన్న బద్వేలు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో పర్యటించిన జగన్ నేడు పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈరోజు ఉదయం 9.05 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్ నివాళులర్పిస్తారు.
వివిధ కార్యక్రమాలకు....
ఆ తర్వాత ఉదయం పది గంటల నుంచి 12 గంటల వరకూ ఇడుపుల పాయలో జరుగుతున్న ప్రార్థనల్లో జగన్ పాల్గొంటారు. అనంతరం పులివెందుల పట్టణంలోని ఇండ్రస్ట్రియల్ డెవెలెప్ మెంట్ పార్క్ కు చేరుకుని అక్కడ ఆదిత్య బిర్లా యూనిట్ కు జగన్ శంకుస్థాపన చేస్తారు. తర్వాత వైఎస్సార్ జగనన్న హౌసింగ్ కాలనీలో ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తారు. బహిరంగసభలో పాల్గొంటారు. తర్వాత మార్కెట్ యార్డులో అభివృద్ధి కార్యక్రనమాలను ప్రారంభిస్తారు. మోడల్ పోలీస్ స్టేషన్ ను ప్రారంభిస్తారు. రాణితోపు సమీపంలో ఆక్వా హబ్ ను ప్రారంభించిన తర్వాత జగన్ ఇడుపులపాయ చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.