Ys Jagan : నేడు దుర్గగుడికి జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విజయవాడలో పర్యటించనున్నారు. దుర్గగుడికి రానున్నారు
Andhra pradesh
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విజయవాడలో పర్యటించనున్నారు. దుర్గగుడికి రానున్నారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనను చేయనున్నారు భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయాన్ని తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం 225 కోట్ల రూపాయలతో నిధులను కేటాయించింది. ఈ పనులకు నేడు జగన్ శంకుస్థాపన చేయనున్నారు.
అభివృద్ధి పనులకు...
భక్తుల క్యూ లైన్లతో పాటు వాహనాల పార్కింగ్ వంటి సమస్యలను శాశ్వతంగా సమస్యను పరిష్కరించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విజయవాడ ఇంద్రకీలాద్రికి ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుండటంతో సరైన వసతులు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. వీటి పరిష్కారినికి ప్రభుత్వం 70 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. ఆలయ నిధులతో కలిపి అభివృద్ధి పనులను చేపడతామని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.