Ys Jagan : నేడు తిరుపతికి జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు తిరుపతిలో పర్యటించనున్నారు.
chief minister ys jagan will come to hyderabad today.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. తిరుపతిలో జరగనున్న ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ లో ఆయన పాల్గొంటారు. తిరుపతిలోని తాజ్ హోటల్ లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సమ్మిట్ లో ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న వివిధ కార్యక్రమాలను గురించి ఆయన వివరించనున్నారు.
విద్యాశాఖలో...
విద్యాశాఖలో అమలు చేసిన సంస్కరణల గురించి ప్రస్తావించనున్నారు. మధ్యాహ్నం తాడేపల్లి నుంచి బయలుదేరి తిరుపతికి చేరుకుని ఎడ్యుకేషన్ సమ్మిట్ లో పాల్గొన్న అనంతరం తిరిగి విజయవాడకు చేరుకుంటారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు తాజ్ హోటల్ వద్ద భారీ బందోబస్తును నిర్వహిస్తున్నారు.