Ys Jagan : 14న సిక్కోలుకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 14వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు
ys jagan Chief minister
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 14వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఉద్దానం కిడ్నీ సమస్య నివారణకు చేపట్టిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. ఆరోజు ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి శ్రీకాకుళం జిల్లా పలాసకు ముఖ్యమంత్రి జగన్ చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
పలాస లో జరిగే...
పలాసలో వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి పలాస రైల్వే గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సబలో ఆయన పాల్గొంటారు. ముఖ్యమంత్రి సభకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి సీదిరి అప్పలరాజుతో పాటు ఉన్నతాధికారులు పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.