Ys jagan : నేడు దెందూలూరులో "సిద్ధం"

ఆంధ్రప్రదేశ్ ముఖ్మమంత్రి వైఎస్ జగన్ నేడు దెందులూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

Update: 2024-02-03 02:14 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్మమంత్రి వైఎస్ జగన్ నేడు దెందులూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వైసీపీ నిర్వహించనున్న సిద్ధం సభకు ఆయన హాజరు కానున్నారు. తొలి సభ ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించి భీమిలీలో నిర్వహించగా, మలి విడతగా దెందులూరులో జరుపుతున్నారు. ఇక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొన్నారు. ఎన్నికలకు నేతలను, క్యాడర్ ను సమాయత్తం చేసే దిశగా జగన్ సిద్ధం సభల్లో ప్రసంగిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకూ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడంతో పాటు ప్రతి కుటుంబానికి జరిగిన మంచిన వివరించి ప్రజలను పార్టీ వైపు మళ్లించాలని క్యాడర్ కు చెబుతున్నారు. తాము ఏ పరిస్థితుల్లో నేతలను మార్చిందీ కూడా వివరిస్తున్నారు.

యాభై నియోజకవర్గాల నుంచి...
ఈ సభకు ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి కార్యకర్తలు, నేతలు హాజరు కానున్నారు. దాదాపు మూడు జిల్లా నుంచి యాభై నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు హాజరు కానున్నారు. ఈ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి జగన్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఎమ్మెల్యేలను మార్చిన చోట ఇన్‌ఛార్జులే పార్టీ కార్యకర్తలను సభకు తీసుకు వచ్చే బాధ్యతలను పార్టీ ఇప్పటికే అప్పగించింది. ముఖ్యమంత్రి జగన్ ఏలూరు జిల్లా దెందులూరుకు వస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే లోపు నాలుగు ప్రాంతాల్లో సిద్ధం సభలను నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.


Tags:    

Similar News