జగనన్న వసతి దీవెన నేడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు

Update: 2023-04-26 04:23 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. శింగనమల నియోజకవర్గంలోని నార్పలకు రానున్నారు. అక్కడ జగనన్న వసతి దీవెన నిధులను విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ. 912.71 కోట్లు బటన్‌ నొక్కి ముఖ్యమంత్రి జగన్ జమ చేయనున్నారు. జగన్‌ నేడు తల్లుల ఖాతాల్లో రూ. 912.71 విడుదల చేయనున్నారు. జగన్ పర్యటనకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

912 కోట్లు...
వీటితో కలిపి జగనన్న వసతి దీవెన ద్వారా ఇప్పటివరకు 25,17,245 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ. 4,275.76 కోట్లు జమ చేసినట్లు సీఎం కార్యాలయ అధికారులు తెలపిరాు. జగనన్న వసతి దీవెన. ఉన్నత చదువులు చదివే పేద విద్యార్ధులకు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్ధులకు రూ. 10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్ధులకు రూ. 15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ. 20 వేల చొప్పున ఆర్ధిక సాయం, కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికి, వారి తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి రెండు దఫాల్లో నేరుగా జమ చేస్తున్నారు.


Tags:    

Similar News