బీసీ నేతలతో జగన్ భేటీ నేడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు బీసీ నేతలతో సమావేశం కానున్నారు
cm jagan
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు బీసీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో బీసీలకు చెందిన మంత్రులు, ముఖ్యమైన నేతలు పాల్గొంటారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం చేపట్టిన బీసీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఆయన నేతలతో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
మరింత దగ్గర చేసుకునేందుకు...
అలాగే రానున్న కాలంలో బీసీ ఓటర్లను మరింతగా దగ్గరకు చేర్చుకునేందుకు ఏమి చేయాలన్న దానిపై బీసీ నేతలతో సమాలోచనలు చేయనున్నారు. ప్రజల్లోకి వెళ్లి ఈ ప్రభుత్వం బీసీలకు దగ్గరయిందన్న విషయాన్ని తెలియజేయాలని దిశానిర్దేశం చేయనున్నారని చెబుతన్నారు. ఈ సమావేశానికి మంత్రులు జోగి రమేష్, బూడి ముత్యాల నాయుడు, బొత్స సత్యనారాయణ, గుమ్మనూరు జయరాం, చెల్లుబోయిన వేణుగోపాల్ తో పాటు మరికొందరు ముఖ్యమైన నేతలు హాజరు కానున్నారు.