ఆర్థిక పరిస్థితి భేష్... అదంతా ట్రాష్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ముప్పేమీ లేదన్నారు. అసెంబ్లీలో పారిశ్రామిక ప్రగతి, పెట్టుబడులు అంశంపై స్వల్పకాలిక చర్చలో జగన్ మాట్లాడారు. రాష్ట్రం బాగున్నా చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్రం మరో శ్రీలంకలా తయారైందని అబద్దాలను ప్రచారం చేస్తున్నారని జగన్ అ్నారు. జీడీపీ గ్రోత్ రేట్ లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ గా ఉందన్నారు. కోవిడ్ లాంటి సవాళ్లు ఎదురైనా ప్రజలకు వివిధ పథకాలను అందించడం ద్వారా వారి కొనుగోలు శక్తిని పెంచగలిగామని జగన్ తెలిపారు. చంద్రబాబు హయాంలో 5.36 శాతం ఉన్న జీడీపీ తమ పరిపాలనలో 6.9 శాతానికి పెరిగిందని జగన్ తెలిపారు.
ప్రజల కొనుగోలు శక్తి తగ్గకుండా....
ప్రజల కొనుగోలు శక్తి తగ్గకుండా, వస్తువుల డిమాండ్ పడి పోకుండా చూడగలిగామని తెలిపారు. మేనిఫేస్టోలో చెప్పిన 98.4 శాతం హామీలను అమలు చేశామని జగన్ తెలిపారు. ఇక అప్పులు గురించి కూడా ప్రభుత్వంపై చంద్రబాబు అండ్ కో దుష్ప్రచారం చేస్తుందన్నారు. విభజన నాటికి ఆంధప్రదేశ్ లో అప్పులు1.26 లక్షల కోట్లు ఉన్నాయి. గత ప్రభుత్వం 2.69 లక్షల కోట్లు అప్పలు చేసిందన్నారు. చంద్రబాబు దిగిపోయి ఈ ప్రభుత్వం వచ్చిన మూడేళ్లలో 3.28 లక్షల కోట్ల అప్పు రాష్ట్రానికి ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కంటే రాష్ట్రం అప్పలు ఎక్కువ చేయలేదన్నారు. ఈ మూడేళ్లలో కేంద్రం రుణాలు 135 లక్షల కోట్లకు పెరిగాయని జగన్ తెలిపారు. చేసిన అప్పులను తిరిగి చెల్లించడంలోనూ ప్రభుత్వం ముందుందని తెలిపారు.