Chandrababu : చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 11.15 గంటలకు ఉండవల్లి లోని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి చంద్రబాబు సచివాలయానికి రానన్నారు. ఉదయం 11.30 గంటలకు 26వ తేదీ నుంచి జరిగే సింగపూర్ పర్యటనపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
సాయంత్రం హైదరాబాద్ కు...
మధ్యాహ్నం 12.15 గంటలకు పీ4పై చంద్రబాబు నాయుడు సమీక్ష చేస్తారు. ఇప్పటివరకూ ఎన్ని బంగారు కుటుంబాలను గుర్తించారని, ఎవరికి సాయం అందిందన్న దానిపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటారు. మరికొన్ని కుటుంబాలను ఎంపిక చేయాలని నిర్దేశించనున్నారు. సాయంత్రం 5.40 గంటలకు హైదరాబాద్ వెళ్తారు. రేపు హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్తారు.