Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు. అధికారులతోనూ, మంత్రులతోనూ కీలక సమావేశాలు నిర్వహించి వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ఈరోజు ఉదయం 11.15 గంటలకు ఉండవల్లి క్యాంప్ కార్యాలయం నుంచి చంద్రబాబు సచివాలయానికి చేరుకుంటారు.
వ్యవసాయ శాఖపై...
తర్వాత ముందుగా అపాయింట్ మెంట్ తీసుకున్న వారితో సమావేశమవుతారు. అనంతరం మూడు గంటలకు వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తారు. ప్రధానంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో యూరియా కొరతపై చంద్రబాబు అధికారులతో సమీక్షించనున్నారు. వర్షాభావ పరిస్థితులపై కూడా చర్చించనున్నారు. సాయత్రం 6.45 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. రాత్రి 7.30 గంటలకు యూఏఈ దేశ ఆర్థిక మంత్రితో చంద్రబాబు సమావేశం అవుతారు.