Chandrababu : నేటి చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు విడుదల చేశారు. పలు శాఖలపై సమీక్ష చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు విడుదల చేశారు. నేడు చంద్రబాబు నాయుడు పలు శాఖలపై అధికారులు, మంత్రులతో సమీక్ష చేయనున్నారు. ఉదయం 11.45 గంటలకు ఉండవల్లి ముఖ్యమంత్రి నివాసం నుంచి చంద్రబాబు సచివాలయానికి చేరుకుంటారు.
వివిధ శాఖలపై...
మధ్యాహ్నం 12 గంటలకు పరిశ్రమలు, మౌలిక సదుపాయాలపై సమీక్షను చంద్రబాబు చేస్తారు. 3 గంటలకు ఆర్టీజీఎస్ పై సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం 5.40 గంటలకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రానికి చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. 6 గంటలకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. రాత్రి 7.05 గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు