Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు ప్రకటించారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు ప్రకటించారు. వివిధ శాఖలపై ఆయన సమీక్షలను నిర్వహించనున్నారు. వివిధ రంగాల సమస్యల పై చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. ఉండవల్లి నివాసం నుంచి ఉదయం 11.45 గంటలకు సచివాలయానికి వెళ్తారు.
నేటి సమీక్షలు...
మధ్యాహ్నం 12.30 గంటలకు మామిడి, కోకో, పొగాకు పంటల మద్దతు ధరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల అమలు తీరు, ప్రస్తుత పరిస్థితిపై చంద్రబాబు నాయుడు సమీక్ష చేస్తారు. అనంతరం 2.45 గంటలకు ఆదాయార్జన శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు సచివాలయం నుంచి తిరిగి ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.