Chandrababu : తిరుమలలోనే చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు తిరుమలలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు

Update: 2025-09-25 02:47 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు తిరుమలలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తిరుమలలో ఉదయం 8.30 గంటలకు ఉప రాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తో కలిసి శ్రీవారి దర్శనానికి వెళతారు. ుదయం9.10 గంటలకు భక్తుల కోసం టీటీడీ కొత్తగా నిర్మించిన వెంకటాద్రి నిలయం భవన సముదాయం ప్రారంభ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి తో కలిసి పాల్గొంటారు. అనంతరం ఉపరాష్ట్రపతికి పద్మావతి వసతి గృహంలో వీడ్కోలు పలుకుతారు.

అసెంబ్లీ సమావేశాల్లో...
అనంతరం టీటీడీ కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను 9.55 గంటలకు ప్రారంభిస్తారు. అనంతరం తిరుమల నుంచి తిరుపతి తానపల్లి రోడ్డులో హెలిపాడ్ వద్దకు చేరుకుని హెలికాఫ్టర్ ద్వారా అమరావతికి చేరుకుంటారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిఎస్సీ అభ్యర్థులకు నియామకపత్రాలు పంపిణీ చేస్తారు. 6.30 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.


Tags:    

Similar News