Chandrababu : చంద్రబాబు నేడు పీ4 పథకంపై సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. పీ4 పథకం పై సమీక్ష చేస్తారు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 11.15 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి సచివాలయానికి చేరుకుంటారు. నేడు కూడా వివిధ శాఖలపైన, పథకాలపైన చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నారు. అధికారులు, మంత్రులతో సమావేశమవుతారు. నేడు పీ4 పథకంపైచంద్రబాబు సమీక్ష చేస్తారు. ప్లానింగ్ పై చర్చిస్తారు. బంగారు కుటుంబాలకు చేసే ఆర్థిక సాయంతో పాటు నియోజకవర్గాల్ల ఉన్న బంగారు కుటుంబాల డేటాపై సమీక్ష నిర్వహించనున్నారు.
ఉచిత బస్సు పథకంపైనా...
ఉదయం 11.30 గంటలకు స్త్రీ శక్తి పథకం అమలుపై సమీక్షను నిర్వహిస్తారు. ఆగస్టు పదిహేనో తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టనుండటంతో దాని పై అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం 12.15 గంటలకు సీఆర్డీఏపై సమీక్షను చంద్రబాబు నిర్వహించనున్నారు. సాయంత్రం 4.35 గంటలకు 5వ బ్లాక్ లో జరిగే పీ4, స్వర్ణాంధ్ర విజన్ వర్క్ షాప్ పై 175 నియోజకవర్గాల ప్రొఫెషనల్స్ తో వర్క్ షాప్ లో పాల్గొంటారు. సాయంత్రం 6.20 గంటలకు ఉండవల్లి లోని తన నివాసానికి చేరుకుంటారు .