ఏపీ నేతలకు ట్విట్టర్ షాక్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ట్విటర్‌లో బ్లూటిక్ ను కోల్పోయారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ట్విటర్‌లో బ్లూటిక్ ను కోల్పోయారు. ట్విటర్‌లో బ్లూ టిక్ కోల్పోయిన వారిలో రాజకీయ నేతలు, ప్రముఖులు, స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ఉన్నారు. తమిళనాడులోనూ రజనీకాంత్, ముఖ్యమంత్రి స్టాలిన్ తో పాటు పలువురు మంత్రులు బ్లూ టిక్‌ను కోల్పోయారు. వీరంతా సబ్‌స్క్రైబ్ చేసుకోకపోవడం వల్లనే బ్లూటిక్‌ను తొలగించినట్లు ట్విట్టర్ పేర్కొంది.
సబ్‌స్క్రిప్షన్ చేస్తేనే...
నెలకు 900 రూపాయలు చెల్లిస్తేనే బ్లూటిక్ ను ఇవ్వాలని ట్విట్టర్ సంస్థ నిర్ణయించింది. అయితే వీళ్లెవరూ సబ్ స్క్రైబ్ చేసుకోకపోవడంతో బ్లూటిక్ ను తొలగిస్తూ ట్విట్టర్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. బ్లూ టిక్ కోల్పోయిన వారిలో ఇండియన్ క్రికెటర్లు కూడా ఉన్నారు. వారిలో విరాట్ కొహ్లి ఒకరు.