Chandrababu : నేడు రెండో రోజుల సింగపూర్ లో చంద్రబాబు పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు రెండో రోజు సింగపూర్ పర్యటన కొనసాగుతుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు రెండో రోజు సింగపూర్ పర్యటన కొనసాగుతుంది. ఈరోజు కూడా వివిధ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు బృందం భేటీ కానుంది. మొదటి రోజుల పలు సంస్థలతో సమావేశమైన చంద్రబాబు కొన్ని ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి.
వివిధ సంస్థల అధిపతులతో...
నేడు ఎయిర్ బస్, హనీవెల్, ఎవర్వోల్ట్ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. వారికి ఏపీలో పెట్టుబడులు పెడితే ఇచ్చే రాయితీల గురించి చెప్పనున్నారు. దీంతో పాటు సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. రాజధాని అమరావతి నిర్మాణంలో సహకరించాలని కోరనున్నారు. వీరితో పాటు పలు సంస్థల అధిపతులు, నగరాల, అభివృద్ధి, క్రీడలు, పోర్ట్ ఆధారిత పరిశ్రమలపై వారితో చర్చించనున్నారు.