Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు విడుదల చేశారు

Update: 2025-04-24 03:58 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు విడుదల చేశారు. నేడు చంద్రబాబు వివిధ శాఖల అధికారులతో సమీక్షలను నిర్వహిస్తారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సచివాలయంలో జరిగే పలు కార్యక్రమాల్లోనూ చంద్రబాబు పాల్గొంటారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

వర్క్ షాపులో...
ఉండవల్లి నివాసం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం పదకొండున్నర గంటలకు సచివాలయానికి చేరుకుంటారు. అనంతరం పదకొండున్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటన్నర వరకూ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ మరియు మిషన్ లెర్నింగ్‌పై వర్కషాప్‌లో పాల్గొంటారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమావేశమవుతారు. సాయంత్రం 06.15 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.


Tags:    

Similar News