Chandrababu : నేడు కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కుప్పంలో జరిగే గంగమ్మ జాతరకు ఆయన కుటుంబ సమేతంగా హాజరు కానున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
గంగమ్మ జాతరకు...
చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. గంగమ్మ జాతరలో పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు తిరిగి సాయంత్రం విజయవాడకు చేరుకుంటారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. భద్రతా ఏర్పాట్లను ఎస్సీ తో పాటు జిల్లా కలెక్టర్ కూడా సమీక్షించారు.