Chandrababu : ఫిబ్రవరి 1న ఢిల్లీకి చంద్రబాబు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లనున్నారు.

Update: 2025-01-29 02:20 GMT

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లనున్నారు. వచ్చే నెల 1వ తేదీన చంద్రబాబు ఢిల్లీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఢిల్లీలో ఉన్న తెలుగువాళ్లు బీజేపీకి మద్దతు ఇవ్వాలని ఆయన తన ప్రచారంలో కోరనున్నారు. వచ్చే నెల ఐదో తేదీన ఢిల్లీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చంద్రబాబును ఢిల్లీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని బీజేపీ కేంద్ర నాయకత్వం కోరింది.

ఎన్నికల ప్రచారంలో...
బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఢిల్లీలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మూడు పార్టీలూ ఉచిత పథకాలను ప్రకటించాయి. ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం మూడు పార్టీలు శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నాయి.


Tags:    

Similar News