Chandrababu : సంపద సృష్టిస్తా.. పేదలకు పంచుతా
అన్నమయ్య జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన పూర్తయింది
అన్నమయ్య జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన పూర్తయింది. బోయినపల్లిలో దోబీ ఘాట్ పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు దోబీ ఘాట్‌లో రజకులను పలకరించారు. ప్రభుత్వం నెలా నెలా అందిస్తున్న పథకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. దోబీ ఘాట్‌లో ఇబ్బందులు ఉన్నాయా అని ముఖ్యమంత్రి చంద్రబాబు అడగడంతో తమకు షెడ్లు కావాలని, దుస్తులు ఆరేసుకునేలా సౌకర్యాలు కల్పించాలన్న రజకులు కోరారు. రజకులు కోరినట్లు షెడ్లు నిర్మించాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
విశ్రాంతి లేకుండా...
తన రాజకీయ జీవితలో ఏనాడూ విశ్రాంతి తీసుకోలేదని చంద్రబాబు నాయుడు తెలిపారు. సంపద సృష్టించి పేదలకు అందించాలన్నదే తమ ప్రభుత్వం ప్రధాన ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు. భావితరాలకు బంగారు భవిష్యత్ అందించాలన్నదే తమ ఆలోచన అని అన్నారు. రాయలసీమకు సాగు, తాగునీరు అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్నదే తమ భవిష్యత్ ప్రణాళిక అని చంద్రబాబు అన్నారు. రాజంపేట మండలం మునక్కాయలపల్లెలో చంద్రబాబు పర్యటించారు. దివ్యాంగురాలు సుమిత్రమ్మకు పింఛను సొమ్ము అందచేశారు. అనంతరం ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. అభివృద్ధితో పాటు పేదల ఆదాయం పెరగాలన్నదే తమ ధ్యేయమని చంద్రబాబు పేర్కొన్నారు.