Chandrababu : చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు

Update: 2025-10-03 02:59 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 11.30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సచివాలయానికి రానున్నారు. ఉదయం చంద్రబాబు నాయుడు11.45 గంటలకు పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష చేస్తారు. పోలవరం ప్రాజెక్టు పురోగతిపై నీటిపారుదల శాఖ అధికారులు, మంత్రితో చంద్రబాబు సమీక్ష చేస్తారు.

పోలవరం ప్రాజెక్టుపై...
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగం పెంచాలని, అనుకున్న సమయానికి పనులు పూర్తి అయ్యేలా చేయాలని అధికారులను ఆదేశించనున్నారు. భారీ వర్షాలతో పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించిన పనుల ఆలస్యంపై కూడా చంద్రబాబు అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు కేబినెట్ భేటీలో పాల్గొంటారు. సాయంత్రం 5.30 గంటలకు చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.


Tags:    

Similar News