Chandrababu : చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.

Update: 2025-08-25 03:43 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. నేడు వివిధ శాఖలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేయనున్నారు. అధికారులు, మంత్రులతో ఆయన సమావేశమవుతారని అధికారులు వెల్లడించారు. ఈరోజు ఉదయం .45 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయానికి రానున్నారు.

ఆరోగ్య శాఖపై...
ఉదయం11.50 గంటలకు ఐఐటీ-ఎన్ఐటీ ర్యాంకర్లు, సోషల్ వెల్ఫేర్ శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఆరోగ్యశాఖపై చంద్రబాబు నాయుడు సమీక్ష చేస్తారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల తలెత్తిన సీజనల్ వ్యాధులపై అధికారులతో చర్చిస్తారు. వాటికి సంబంధించిన తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకకుంటారు. సాయంత్రం 5.45 గంటలకు ఇరిగేషన్ శాఖ, హంద్రీనీవా ప్రాజెక్టుపై సమీక్ష చేస్తారు. సాయంత్రం 6.30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.


Tags:    

Similar News