Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్ ఏంటంటే?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. వివిధ శాఖలపై ఆయన ఈరోజు సమీక్ష చేయనున్నారు. ఉదయం పదకొండున్నర గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం నుంచి సచివాలయానికి చేరుకుంటారు. అధికారులు, ముందుగా అపాయింట్ మెంట్ ఇచ్చిన వారితో సమావేశమవుతారు.
శాఖలపై సమీక్షలు...
అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు సచివాలయంలో ప్లానింగ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు సర్క్యులర్ ఎకానమీపై సమీక్ష ను సీఎం నిర్వహించనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.