Andhra Pradesh : నేడు విజయనగరం జిల్లాకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలోపాల్గొంటారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. ఢిల్లీ నుంచి విశాఖకు చేరుకుని అక్కడి నుంచి విజయనగరం జిల్లాలో పర్యటిస్తారు. విజయనగరం జిల్లాలోని దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో ఆయన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఎన్టీఆర్ భరోసా పింఛన్లను...
స్వయంగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చంద్రబాబు చేపట్టనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన నాటి నుంచి చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమంలో స్వయంగా పాల్గొంటున్న నేపథ్యంలో నేడు విజయనగరం జిల్లాలో పాల్గొంటారు. అనంతరం పేదలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం టీడీపీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది.