Chandrababu:నేడు విశాఖకు చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విశాఖపట్నం వెళ్లనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విశాఖపట్నం వెళ్లనున్నారు. విశాఖపట్నం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 11.40 గంటలకు విశాఖకు చేరుకుంటారు. ఈ నెల 21వ తేదీన ఆర్కే బీచ్ లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల ఏర్పాట్లకు సంబంధించిన వేదికలను పరిశీలిస్తారు. ఆర్కే బీచ్ రోడ్డులో యోగా వేడుకలకు ఇప్పటికే అధికారులు అన్నీ సిద్దం చేస్తున్నారు. విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకూ ప్రధాని నరేంద్రమోదీ పాల్గొనే యోగా డే వేడుకల్లో ఐదు లక్షల మంది పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు.
యోగా డే ఏర్పాట్లను చూసి...
ఆర్కే బీచ్ లో ఏర్పాట్లను చూసిన తర్వాత నేరుగా ఏయూ ఇంజినీరింగ్ కళాశాలకు చేరుకుంటారు. అక్కడ నుంచి మధ్యాహ్నం నోవాటెల్ హోటల్ కు వెళ్లి అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం ప్రధాని కార్యక్రమానికి జనసమీకరణకు సంబంధించి నేతలతో సమావేశమవుతారు. అనంతరం అక్కడి నుంచి పల్లా శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. తిరిగి రాత్రికి విజయవాడకు చేరుకుంటారు. చంద్రబబాబు నాయుడు విశాఖపట్నం వస్తుండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.