Chandrababu : నేడు చంద్రబాబు తిరుపతికి రాక

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తిరుపతిలో పర్యటించనున్నారు.

Update: 2025-07-19 02:41 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. తూకివాకంలోని ఇంటిగ్రేటెడ్ మేనేజ్ మెంట్ యూనిట్ ను చంద్రబాబు పరిశీలించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు కపిలతీర్థం ఆలయానికి చేరుకుంటారు. ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు.

ప్రజా వేదిక కార్యక్రమంలో...
అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. చంద్రబాబు తిరుపతి పర్యటన సందర్భంగా పెద్దయెత్తున కార్యకర్తలు తరలి వస్తున్నారు. తిరుపతి లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. చంద్రబాబు తిరుపతి పర్యటన ముగించుకుని అక్కడి నుంచి నేరుగా సాయంత్రం నాలుగు గంటలకు కంచిపీఠాన్ని చేరుకుని అక్కడ సందర్శిస్తారు.


Tags:    

Similar News