Chandrababu : రేపు రాజంపేటకు చంద్రబాబు
రేపు రాజంపేటలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. రేపు ఒకటో తేదీ కావడంతో పింఛన్ల మంజూరు చేయనున్నారు
రేపు రాజంపేటలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. రేపు ఒకటో తేదీ కావడంతో పింఛన్ల మంజూరు చేయడానికి ఆయన అన్నమయ్య జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నార. రాజంపేట మండలం బోయనపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్లు అందజేయనున్నారు.
పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో...
రాజంపేట మండలం తాళ్లపాక ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించనున్న చంద్రబాబు అనంతరం పార్టీ నేతలతోనూ ముఖ్య కార్యకర్తలతోనూ సమావేశం అవ్వనున్నారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.