Chandrababu : నేడు ప్రకాశం జిల్లాకు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు

Update: 2025-08-02 01:22 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించనున్నారు. దదర్శి మండలం తూర్పువీరాయపాలెం నుంచి ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే రెండు వేల రూపాయల నగదుకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఐదు వేల రూపాయలు జమ చేయనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా...
ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 46.85 లక్షల మంది లబ్దిదారులు ప్రయోజనం పొందుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా విడుదల చేయనున్న అన్నదాత సుఖీభవ పథకం నేడు విడుదల చేయనున్నారు. ఈ మేరకు దర్శి నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశారు. భారీగా రైతులను సమీకరించనున్నారు. తూర్పు వీరాయపాలెంలో రైతులతో చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.


Tags:    

Similar News