Chandrababu : నేడు ప్రకాశం జిల్లాకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన మార్కాపురం నియోజకవర్గంలో పర్యటిస్తారు. అక్కడ జరిగే మహిళ దినోత్సవం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. నేడు అంతర్జాతీయ మహిళ దినోత్సవం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.
మార్కాపురం నియోజకవర్గంలో...
అందులో భాగంగా చంద్రబాబు నేడు మహిళ దినోత్సవ వేడుకలను మార్కాపురంలో మహిళల మధ్య జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. మహిళలకు ఈ రోజు ప్రత్యేకంగా కానుకను ప్రకటించే అవకాశముందని చెబుతున్నారు. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేలా ఆయన నిర్ణయం ప్రకటిస్తారని తెలిసింది. సాయంత్రం పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు.