Andhra Pradesh : నేడు నూజివీడుకు చంద్రబాబు

Andhra Pradesh : నేడు నూజివీడుకు చంద్రబాబు

Update: 2025-04-11 02:36 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు నూజివీడులో పర్యటించనున్నారు. చంద్రబాబు అగిరిపల్లిలో జరిగే ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రజాసమస్యలను అడిగి తెలుసుకుంటారు. దీంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఆయన ప్రారంభించనున్నారు. ప్రజా వేదికలో ముఖాముఖి ప్రజలతో మాట్లాడనున్నారు.

సాయంత్రం కడప జిల్లాకు...
చంద్రబాబు నూజివీడు వస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలు నేరుగా చంద్రబాబుతో మాట్లాడే అవకాశమున్నందున భారీ సంఖ్యలో తరలి వచ్చే అవకాశముంది. ఈరోజు నూజివీడులో పర్యటించిన తర్వాత సాయంత్రం కడప జిల్లాకు చేరుకుని ఒంటిమిట్ట సీతారామ కల్యణానికి స్వామి వారికి పట్టు వస్త్రాలను చంద్రబాబు సమర్పించనున్నారు.


Tags:    

Similar News