Chandrababu : నేడు కందుకూరుకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు నెల్లూరు జిల్లా కందుకూరులో పర్యటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు నెల్లూరు జిల్లా కందుకూరుకు చేరుకుంటారు. గతంలో ప్రకాశం జిల్లాలో ఉండే కందుకూరు గ్రామంలో దూబగుంట సమీపంలో ఏర్పాటు ఎఆర్ఎఫ్ ఫెసిలిటీ సెంటర్ చేరుకుని అక్కడ యంత్రాలను ప్రారంభించనున్నారు.
స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో...
స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామంలో వీధులు, డ్రైనేజీలుశుభ్రం చేసే కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. అలాగే ముందుగా నిర్ణయించిన మూడు గృహాల్లో ఇంకుడు గుంతలను కూడా చంద్రబాబు ప్రారంభించనున్నారు. అనంతరం పార్కు కమ్ పాండ్ ను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.