Chandrababu : రేపు జమ్మలమడుగుకు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు జమ్మలమడుగులో పర్యటించనున్నారు

Update: 2025-07-31 04:13 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు జమ్మలమడుగులో పర్యటించనున్నారు. ఒకటో తేదీ కావడంతో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్లు మంజూరు చేయనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రితో పాటు ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

పింఛన్ల పంపిణీలో...
ముఖ్యమంత్రి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని నేరుగా లబ్దిదారులతో మాట్లాడతారు. అనంతరం వారితో కలసి కాసేపు ముచ్చటించిన అనంతరం ప్రజాదీవెన సభలో కూడా పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు పరిశీలించారు.


Tags:    

Similar News