Chandrababu :నేడు అన్నమయ్య జిల్లాకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా కడప విమానశ్రాయనికి చంద్రబాబు చేరుకోనున్నారు. కడప విమానాశ్రయం నుంచి హెలికాపర్ట్ లో రాజంపేటకు చంద్రబాబు నాయుడు చేరుకుంటారు.
సామాజిక పింఛన్ల పంపిణీ...
రాజంపేటలోని బోయినపల్లిలో సామాజిక పింఛన్లను చంద్రబాబు నాయుడు పంపిణీ చేస్తారు. స్వయంగా లబ్దిదారుల ఇంటికి వెళ్లి వారికి పింఛన్ల మొత్తాన్ని అందచేసి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం అక్కడ దోబీఘాట్ ను పరిశీలించనున్నారు. తర్వాత ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.