Chandrababu : నేడు డీజీపీతో చంద్రబాబు భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు డీజీపీతో సమావేశం కానున్నారు.

Update: 2025-04-27 03:06 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు డీజీపీతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై వీరిద్దరి మధ్య చర్చజరిగే అవకాశముంది. కీలక కేసుల విషయాలను డీజీపీని అడిగి తెలుసుకోనున్నారు. ప్రధానంగా మద్యం కేసులో అరెస్టయిన వారి నుంచి వివరాలు సేకరించడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

మోదీ పర్యటనపై...
అదే సమయంలో వచ్చే నెల 2వ తేదీన ప్రధాని మోదీ అమరావతి రానున్నారు. రాజధాని నిర్మాణ పనుల పునర్మిర్మాణ పనులను ప్రారంభించడానికి మోదీ వస్తుండటంతో తీసుకోవాల్సిన చర్యలు, చేయాల్సిన ఏర్పాట్లపై చంద్రబాబు డీజీపికి సూచించనున్నారు. ఐదు లక్షల మంది హాజరయ్యే ఈ సభ సజావుగా జరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించనున్నారు.


Tags:    

Similar News