Chandrababu : నేడు కడప కు వెళ్లనున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కడప జిల్లాకు బయలుదేరి వెళ్లనున్నారు

Update: 2025-05-26 02:50 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కడప జిల్లాకు బయలుదేరి వెళ్లనున్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు కడపలోనే ఉండనున్నారు. కడపలో ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకూ మహానాడు జరగనున్న నేపథ్యంలో నేడు చంద్రబాబు కడపకు బయలుదేరి వెళతారు. సాయంత్రం ఆరు గంటలకు అమరావతి నుంచి బయలుదేరి నేరుగా కడపకు బయలుదేరి వెళతారు.

మూడు రోజులు...
కడప జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు రోజులు ఉన్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆయనకు ప్రత్యేకంగా బస ఏర్పాట్లు చేశారు. అయితే ఈరోజు ఉదయం పదకొండు గంటలకు సచివాలయానికి చంద్రబాబు రానున్నారు. వివిధ శాఖలను సమీక్షించనున్నారు.
ప్రభుత్వ పథకాల అమలు - సర్వే రిపోర్టుపై సమీక్ష నిర్వహించిన అనంతరం సాయంత్రం కడపకు బయలుదేరి వెళతారు.


Tags:    

Similar News