Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది.

Update: 2024-12-30 03:14 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. ఈరోజు ఉదయం పదకొండు గంటలకు చంద్రబాబు సచివాలయానికి చేరుకుంటారు. కొన్ని కీలక శాఖలతో సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్టేట్ ఇన్విస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు.


పెట్టుబడుల కోసం...

చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు, కొత్త పరిశ్రమల ఏర్పాటుపై అధికారులతో చంద్రబాబు చర్చిస్తారు. టీసీఎస్ ఇప్పటికే విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో దాని పురోగతిపై కూడా అధికారులతో చర్చించనున్నారు. ఇంధన శాఖకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులకు ఈ సమాశం ఆమోదం తెలపనుంది.





Tags:    

Similar News